ఎల్బీనగర్: చైతన్యపురి, ఫణిగిరి కాలనీలో శ్రీ వినాయక భక్త సమాజ్ ఆధ్వర్యంలో చైతన్యపురి, ఫణిగిరి కాలనీలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గత 14 రోజులుగా చైతన్యపురి నుంచి సరూర్‌నగర్ వరకు వివిధ కార్యక్రమాలు, స్వామివారి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి ప్రసాదమైన లడ్డూను వేలం పాట నిర్వహించగా, ఆశిష్ కుమార్ రూ.37,100కు లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా ఆశిష్ కుమార్ మాట్లాడుతూ, గణనాథుని ఆశీస్సులతో వరుసగా మూడోసారి స్వామివారి లడ్డూను వేలంలో దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృపతో ప్రతి సంవత్సరం ఇలాగే వేలంలో పాల్గొని లడ్డూను దక్కించుకుంటానని తెలిపారు.
గత 14 రోజులుగా నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సహకారంతో ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని శ్రీ వినాయక భక్త సమాజ్ నిర్వాహకులు తెలిపారు.





