Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనుమతి లేకుండా వెంచర్లు పత్తిపాటి ప్రభాకర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనుమతి లేకుండా వెంచర్లు పత్తిపాటి ప్రభాకర్

*అనుమతులు లేకుండా వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు*

మైలవరం,సెప్టెంబర్‌:-26

మైలవరం మండలం వెల్వడం గ్రామ పరిధిలోని భాస్కర్‌నగర్‌ కాలనీ వద్ద కొన్ని సర్వే నంబర్లలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ వెల్వడం గ్రామానికి చెందిన ప్రతిపాటి ప్రభాకరరావు మైలవరం తహశీల్దార్‌ అబ్దుల్ ధరియా కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం అనుమతి లేకుండా వెంచర్లు సర్వే నంబర్లు 502-2, 508-3ఎ, 508-3బి, 524-1, 509-2 తదితర భూముల్లో అనుమతులు తీసుకోకుండా అక్రమంగా వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పంచాయతీకి రావాల్సిన 10 శాతం ల్యాండ్‌ను ఇవ్వకుండా, సీఆర్‌డీఏ అనుమతులు లేకుండానే లేఅవుట్‌ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శికి, ఇరిగేషన్‌ అధికారులకు, ప్రెసిడెంట్‌,సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అంతేకాకుండా పంట పొలాలకు వెళ్లే సాగునీటి కాలువను పూడ్చి, కాలువపై తారు రోడ్డును నిర్మించారని ఆరోపించారు.
సాగునీటి కాలువను పూడ్చడం వల్ల సుమారు 150 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వెంచర్‌ పనులను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని ప్రతిపాటి ప్రభాకరరావు కోరారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనుమతి లేకుండా వెంచర్లు పత్తిపాటి ప్రభాకర్

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం అనుమతి లేకుండా వెంచర్లు పత్తిపాటి ప్రభాకర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *