Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

భైంసా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదానం….

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భైంసా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదానం….

వార్త ముఖ్యాంశాలు

  • భైంసా: సమాజ సేవలో భాగంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు.
  • భైంసా బీజేవైఎం యువకులు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ''సేవా సంకల్ప అభియాన్'' లో భాగంగా శనివారం భైంసా పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

భైంసా: సమాజ సేవలో భాగంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచారు. భైంసా బీజేవైఎం యువకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ”సేవా సంకల్ప అభియాన్” లో భాగంగా శనివారం భైంసా పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా 14 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో యువత రక్తదానానికి ముందుకు వచ్చారు. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్, బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింధె గంగా ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆకుల రంజిత్, అప్పల రాకేష్, కార్యదర్శి స్వరాజ్, కార్యవర్గ సభ్యులు భీమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *