ఖమ్మం / కొత్తగూడెం /హైదరాబాద్
తెలంగాణ ధీరవనిత, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఐలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి, తాటి వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ప్రజల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యసాహసాలను నాయకులు గుర్తుచేసుకున్నారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
