Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: వికారాబాద్, చౌడాపూర్ మండలం,
మల్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ వీరనారి, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ చాకలి లావణ్య రామాంజనేయులు, తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. గోపాల్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్. గోపాల్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆమె ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొని చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను విజయవంతం చేశారు.

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *