Tuesday, 29 September 2026
  • Home  
  • ఎస్‌ఐఆర్ పేరుతో ఓటు హక్కును హరించే కుట్ర: రమావత్ సక్రు నాయక్
- రంగారెడ్డి

ఎస్‌ఐఆర్ పేరుతో ఓటు హక్కును హరించే కుట్ర: రమావత్ సక్రు నాయక్

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ గిరిజన సమాఖ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాణావత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రమావత్ సక్రు నాయక్ మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో సామాన్య ప్రజల ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపుపై ప్రజలకు పూర్తి సమాచారం అందించి, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకుని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, దాని పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా పనిచేయాలని రమావత్ సక్రు నాయక్ కోరారు.

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ గిరిజన సమాఖ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాణావత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రమావత్ సక్రు నాయక్ మాట్లాడారు.

ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో సామాన్య ప్రజల ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపుపై ప్రజలకు పూర్తి సమాచారం అందించి, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకుని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని పిలుపునిచ్చారు.

ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, దాని పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా పనిచేయాలని రమావత్ సక్రు నాయక్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.