Sunday, 27 September 2026
  • Home  
  • అమలాపురం మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ జాతీయ అవార్డు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ జాతీయ అవార్డు

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా : అమలాపురం పురపాలక సంఘం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది. పట్టణంలో సమీకృత వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య మెరుగుదల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ (SKOCH) జాతీయ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా అమలాపురం మున్సిపాలిటీ స్కోచ్ పోటీల్లో పాల్గొని అవార్డు సాధించడం విశేషంగా నిలిచింది. వినూత్న పారిశుద్ధ్య పద్ధతులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమాలకు ఈ గుర్తింపు దక్కింది. పురపాలక సిబ్బంది కృషి, ప్రజల సహకారంతోనే అవార్డు సాధ్యమైందని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. Uploaded Video:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
అమలాపురం పురపాలక సంఘం జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించింది. పట్టణంలో సమీకృత వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య మెరుగుదల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ (SKOCH) జాతీయ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి. నిర్మల్ కుమార్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా అమలాపురం మున్సిపాలిటీ స్కోచ్ పోటీల్లో పాల్గొని అవార్డు సాధించడం విశేషంగా నిలిచింది. వినూత్న పారిశుద్ధ్య పద్ధతులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన కార్యక్రమాలకు ఈ గుర్తింపు దక్కింది. పురపాలక సిబ్బంది కృషి, ప్రజల సహకారంతోనే అవార్డు సాధ్యమైందని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.