“పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి. పోలీసు- అంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన ప్రజల్లో కలిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలి” అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్. సవిత నూతన పోలీసు కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. బాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 521 మంది నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత హాజరుకాగా, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.

పోలీసులు భయాన్ని కాదు భరోసా కల్పించాలి