వార్త ముఖ్యాంశాలు
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శనివారం రోజున ఖానాపూరం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన గడ్డం అశోక్ - పూల దంపతుల కూతురు కీర్తన నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ముంజాల రాజేందర్ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- ఈ సందర్భంగా చిన్నారి కీర్తనను వారు ఆశీర్వదించి, నిండు నూరేండ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శనివారం రోజున ఖానాపూరం మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన గడ్డం అశోక్ – పూల దంపతుల కూతురు కీర్తన నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ముంజాల రాజేందర్ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి కీర్తనను వారు ఆశీర్వదించి, నిండు నూరేండ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవించారు.
ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు రామగిరి యాదగిరి స్వామి, సురేష్ గౌడ్, మల్లన్నలతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.