Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదర్ల తిమోతి కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పదర్ల తిమోతి కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని

వార్త ముఖ్యాంశాలు

  • కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో ఇటీవల పరమపదించిన టీడీపీ మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పదర్ల తిమోతి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పరామర్శించారు.
  • తిమోతి నివాసానికి వెళ్లిన బొల్లినేని వెంకట రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
  • తిమోతి టీడీపీ కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో ఇటీవల పరమపదించిన టీడీపీ మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు పదర్ల తిమోతి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు పరామర్శించారు.

తిమోతి నివాసానికి వెళ్లిన బొల్లినేని వెంకట రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తిమోతి టీడీపీ కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన తిమోతి మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొల్లినేని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *