Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యం ప్రజా దర్బార్ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యం ప్రజా దర్బార్ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదర్బార్.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు

ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, సెప్టెంబర్ 25:

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న పి.జి.ఆర్.ఎస్. (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం) ప్రజాదర్బార్ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం పాల్గొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారిని కలిసి తమ సమస్యలను వివరించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, రెవెన్యూ, ఇళ్ల స్థలాలు, సామాజిక పింఛన్లు తదితర అంశాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వారి సమస్యలను సావధానంగా విని, వివరాలను తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి, నిబంధనల మేరకు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తూ పి.జి.ఆర్.ఎస్. ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజల సమస్యలను కేవలం వినడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారులతో సమన్వయం చేస్తూ నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యం ప్రజా దర్బార్ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యం ప్రజా దర్బార్ మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *