Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

మూడు నెలలుగా చీకట్లో ఎగువపేట బీసీ కాలనీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

సిద్ధవటం లోని ఎగువపేట బీసీ కాలనీలో గత మూడు నెలలుగా వీధిలైట్లు వెలగకపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వీధులు చీకటిమయంగా మారడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు రాత్రి సమయంలో రాకపోకలు సాగించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు.వీధిలైట్లు పనిచేయకపోవడంతో కాలనీలోని ప్రధాన వీధులతో పాటు అంతర్గత రహదారులు కూడా చీకట్లోనే ఉంటున్నాయని పేర్కొన్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో విషపురుగులు, పాముల సంచారం ఉండే ప్రాంతాల్లో మరింత ఆందోళనగా ఉంటుందని తెలిపారు.ఈ సమస్యపై పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వీధిలైట్లను మరమ్మతు చేయాలని కోరినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని కాలనీ వాసులు తెలిపారు. మూడు నెలలుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి ఎగువపేట బీసీ కాలనీలో పనిచేయని వీధిలైట్లను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడు నెలలుగా చీకట్లో ఎగువపేట బీసీ కాలనీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *