
For scrolling /publish=================*దాస్యం వినయ్ భాస్కర్ గారిని పరామర్శించిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*24-09-2026 | హన్మకొండ*వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు కాలు, చేతికి గాయాలయ్యాయి. చికిత్స అనంతరం హన్మకొండలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పరామర్శించారు**ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ..**“వినయ్ భాస్కర్ గారు.. ఉద్యమ నాటి గుర్తులను మళ్లీ గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మీకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రజల కోసం పోరాటాన్ని మరింతయూ కొనసాగించాలి” అని అన్నారు**ఈ సందర్భంగా పోలీసులు తన కడుపులో తన్నారని, అడ్డుకునే క్రమంలో దాడి చేయడంతో గాయాలయ్యాయని దాస్యం వినయ్ భాస్కర్ గారు సత్యవతియ్ రాథోడ్ గారికి వివరించారు**ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని సత్యవతి రాథోడ్ గారు స్పష్టం చేశారు**ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు*Plz cover…..

