కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 26:
ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు.జగ్గంపేట రావులమ్మ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.
ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన ఆడారి ఆదిలక్ష్మి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. సంబంధించిన ఫైల్స్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీసుకొని వెళ్లడం జరుగుతుంది అన్నారు.కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, ఏపీ స్టేట్ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, నీలం శ్రీను, రేఖ బుల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, రాయి సాయి, మారిశెట్టి రాధా, సాంబత్తుల చంద్రశేఖర్, జనసేన ఎంపీటీసీ దొడ్డ శ్రీను, వేగి సత్తిబాబు, పోట్రు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా దర్బార్ తో ప్రజాసంస్థలు పరిష్కారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 26: ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు.జగ్గంపేట రావులమ్మ నగర్ లోని క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు పెన్షన్లు, హౌసింగ్ లోన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన ఆడారి ఆదిలక్ష్మి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. సంబంధించిన ఫైల్స్ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీసుకొని వెళ్లడం జరుగుతుంది అన్నారు.కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, ఏపీ స్టేట్ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, నీలం శ్రీను, రేఖ బుల్లి రాజు, పాండ్రంగి రాంబాబు, రాయి సాయి, మారిశెట్టి రాధా, సాంబత్తుల చంద్రశేఖర్, జనసేన ఎంపీటీసీ దొడ్డ శ్రీను, వేగి సత్తిబాబు, పోట్రు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

