Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

*బయోఫ్లాక్, ఆర్.ఏ.ఎస్ (RAS) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు మరియు మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
*బయోఫ్లాక్, ఆర్.ఏ.ఎస్ (RAS) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు మరియు మత్స్యకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. *

వార్త ముఖ్యాంశాలు

  • నరసరావుపేట, సెప్టెంబర్ 24 గురువారం కలక్టరేట్ లోని మీడియా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పధకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది.
  • సమావేశంలో తొలుత ముందుగా గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ లోని రూ.
  • 50 లక్షలకు సంబంధించి రెండు బయోఫ్లాక్ పాండ్స్ 2 , మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ ల పంపిణీకి లబ్దిదారులను ఎంపిక చేసి ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు.

నరసరావుపేట, సెప్టెంబర్ 24
గురువారం కలక్టరేట్ లోని మీడియా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పధకం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో తొలుత ముందుగా గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ లోని రూ. 50 లక్షలకు సంబంధించి రెండు బయోఫ్లాక్ పాండ్స్ 2 , మోటార్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ ల పంపిణీకి లబ్దిదారులను ఎంపిక చేసి ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను నిర్ణీత గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. PMMSY క్రింద జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులను ఎంపిక చేయాలని కమిటీకి సూచించారు. కోల్డ్ స్టోరేజ్ లు , ఐస్ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలెండర్లు , సిన్టెక్స్ బాక్సులు , ఫిష్ రిటైల్ మార్కెట్ నిర్మాణం , చేపల రవాణాకు మూడు చక్రాలతో కూడిన ప్రత్యేక వాహనాలు , జలాశయాల్లో చేప పిల్లలను నిల్వ చేయడం ఫిష్ కియోస్క్ ల ఏర్పాటు , తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి సిద్దం చేయాలన్నారు.

జిల్లా మత్స్య శాఖాధికారి పి. ప్రసాద్ , జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, పల్నాడు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె. రాం ప్రసాద్, ఈఈ ఎన్ ఎస్ పి ఈ. శ్రీనివాస రావు , డీఆర్డీఏ , కృషి విజ్ఞాన్ కేంద్రం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *