దుక్కవానిపాలెం నుంచి శోంఠ్యం NSRIT వరకు తక్షణ చర్యలకు విజ్ఞప్తి
ఆనందపురం (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 24 ::
ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళ్లే నేషనల్ హైవే -16 ప్రధాన రహదారిపై దుక్కవానిపాలెం, మిందివానిపాలెం, శోంఠ్యం NSRIT కాలేజీ సమీప ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రహదారిపై నీరు నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో Nh-16 సంబంధిత అధికారులు స్పందించి, రహదారిపై నిలిచిన వర్షపు నీరు కాలువల్లోకి సులభంగా వెళ్లేలా తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
రహదారిపై నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడితే వాహనదారులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






