నెల్లూరు బాలాజీనగర్ పుట్టవీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సుమారు 40 ఏళ్ల వివాహిత మహిళ టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మనోహర్ అనే వ్యక్తితో ఉన్న పరిచయం, కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆమె కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం టెర్రస్‌పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహిళ తల్లి, మామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

నెల్లూరులో విషాదం.. టెర్రస్‌పై నుంచి దూకి వివాహిత మృతి