Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరులో ఘనంగా మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నందలూరులో ఘనంగా మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సభ

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి గారు మరియు మండల ఎంపీటీసీ సభ్యుల ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మంగళవారం నందలూరులో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు *ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి*, రాజ్యసభ సభ్యులు *మేడా రఘునాథ్ రెడ్డి* హాజరయ్యారు.
  • *ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ...* "గత ఐదేళ్లలో నందలూరు మండలంలో ఎంపీపీ, ఎంపీటీసీలు అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించారు.

నందలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి గారు మరియు మండల ఎంపీటీసీ సభ్యుల ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మంగళవారం నందలూరులో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు *ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి*, రాజ్యసభ సభ్యులు *మేడా రఘునాథ్ రెడ్డి* హాజరయ్యారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ…*

“గత ఐదేళ్లలో నందలూరు మండలంలో ఎంపీపీ, ఎంపీటీసీలు అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీ సేవలను పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది” అని అన్నారు.

రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినా ప్రజల్లోనే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నందలూరు మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *