Friday, 25 September 2026
  • Home  
  • నందలూరులో ఘనంగా మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సభ మేడా విజయ భాస్కర్ రెడ్డి గారు.
- అన్నమయ్య

నందలూరులో ఘనంగా మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సభ మేడా విజయ భాస్కర్ రెడ్డి గారు.

నందలూరులో ఘనంగా మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సభ. నందలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి గారు మరియు మండల ఎంపీటీసీ సభ్యుల ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మంగళవారం నందలూరులో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు *ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి*, రాజ్యసభ సభ్యులు *మేడా రఘునాథ్ రెడ్డి* హాజరయ్యారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ…* “గత ఐదేళ్లలో నందలూరు మండలంలో ఎంపీపీ, ఎంపీటీసీలు అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీ సేవలను పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది” అని అన్నారు. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినా ప్రజల్లోనే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

నందలూరులో ఘనంగా మండల ప్రజా పరిషత్ వీడ్కోలు సభ.
నందలూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మేడా విజయ భాస్కర్ రెడ్డి గారు మరియు మండల ఎంపీటీసీ సభ్యుల ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన సందర్భంగా మంగళవారం నందలూరులో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు *ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి*, రాజ్యసభ సభ్యులు *మేడా రఘునాథ్ రెడ్డి* హాజరయ్యారు.
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ…*
“గత ఐదేళ్లలో నందలూరు మండలంలో ఎంపీపీ, ఎంపీటీసీలు అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మీ సేవలను పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది” అని అన్నారు.
రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినా ప్రజల్లోనే ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నందలూరు మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.