Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేజర్ ధ్యాన్ చంద్ క్రీడాస్ఫూర్తిని విద్యార్థులు పెంపొందించుకోవాలి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మేజర్ ధ్యాన్ చంద్ క్రీడాస్ఫూర్తిని విద్యార్థులు పెంపొందించుకోవాలి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్

గూడూరు ఆగస్టు 29:
భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సంధర్భంగా స్థానిక ఎస్. కె. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా స్పూర్తిని తెలుసుకోవాలని, విద్యార్థులు క్రమశిక్షణ తో వుంటే క్రీడలలో సత్తా చాటుతారని, క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక ధృడత్వాన్ని పెంపొందింపజేస్తాయని మేజర్ ధ్యాన్ చంద్ కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకురాలైన కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు శ్రీమతి ఎం. అమ్మాజి ఆధ్వర్యంలో కళాశాలలోని ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రములు, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమములో కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కె. లావణ్య, డాక్టర్ వెంకట ప్రసాద్, కృపా కరుణా వాణి, గ్రంధాలయ అధ్యాపకుడు డాక్టర్ విజయ మహేశ్, మరియు భోదనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మేజర్ ధ్యాన్ చంద్ క్రీడాస్ఫూర్తిని విద్యార్థులు పెంపొందించుకోవాలి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రాంప్రసాద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *