Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

ఎదులాపురం / ఖమ్మం

ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద తరుణీ హట్ ప్రాంగణంలో కొనసాగుతున్న రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భవన సముదాయం అందుబాటులోకి వస్తే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, దీంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు తోట వీరభద్రం, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *