Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

శివపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శివపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 5; shaking: 0.000195; highlight: 1; motionR: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0009,0.0000; brp_del_sen: 0.1000,0.0000; ispap:1; papproctime: 2026:09:22 20:38:52; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8388608;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 240.31578;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 33;

మన్సూరాబాద్, సాయినగర్ కాలనీ, మన్సూరాబాద్‌లో శివపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

శివపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 11 రోజుల పాటు ప్రతిరోజూ ప్రత్యేక పూజలతో పాటు చిన్నారులు, యువత, భక్తుల కోసం పాటల పోటీలు, వివిధ ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో శివపుత్ర యూత్ అసోసియేషన్ సభ్యులు కళ్యాణ్, వంశీ, శ్రీను, గోపి, గణేష్, తనయ్, ఆకాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

శివపుత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *