Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఉపాధ్యాయులపై రాజకీయ దాడులు సరికాదన్న ఏపీ చైర్మన్ కేకే చౌదరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉపాధ్యాయులపై రాజకీయ దాడులు సరికాదన్న ఏపీ చైర్మన్ కేకే చౌదరి

వార్త ముఖ్యాంశాలు

  • – ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్‌ కేకే చౌదరి విజయవాడ: ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై రాజకీయ ఘర్షణలకు దిగడం సరికాదని ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్‌ కేకే చౌదరి అన్నారు.
  • విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
  • తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను చూపించేందుకు వచ్చిన వారిని గౌరవంగా విని, వాటిపై అధికారికంగా పరిశీలన జరపాల్సింది పోయి ఘర్షణకు దిగడం దురదృష్టకరమన్నారు.

– ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్‌ కేకే చౌదరి

విజయవాడ: ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై రాజకీయ ఘర్షణలకు దిగడం సరికాదని ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల చైర్మన్‌ కేకే చౌదరి అన్నారు. విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను చూపించేందుకు వచ్చిన వారిని గౌరవంగా విని, వాటిపై అధికారికంగా పరిశీలన జరపాల్సింది పోయి ఘర్షణకు దిగడం దురదృష్టకరమన్నారు. ఒక ఉద్యోగం వెనుక యువత సంవత్సరాల కష్టం, కుటుంబాల ఆశలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడా ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన యువతను రాజకీయ ప్రయోజనాల కోసం అవమానించడం తగదన్నారు. ధ్రువపత్రాలపై అనుమానాలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపించాలే తప్ప, రోడ్డుపై వివాదాలకు దిగడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని స్పష్టం చేశారు. గురువు సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తి అని, అలాంటి ఉపాధ్యాయులను అవమానించే చర్యలను సమాజం హర్షించదన్నారు. ధ్రువపత్రాల నిజానిజాలను నిర్ణయించే అధికారం సంబంధిత అధికారులకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన ప్రతి యువకుడి గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని కేకే చౌదరి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *