Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

చేపల వేటలో కెమికల్స్ కలుపుతున్నారా? లేక చేపలు తాజాగా ఉండేందుకు కెమికల్స్ కలుపుతున్నారా?మార్కెట్‌లో కొందరు వ్యక్తులు చేపల విక్రయాలపై ఆరోపణలు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి.
  • నీటి, చేపల నమూనాలను పరీక్షించాలని స్థానికుల డిమాండ్ బోగోలు, బిట్రగుంట : బోగోలు మండల పరిధిలో చేపల వేట, చేపల విక్రయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • చేపలు పట్టే సమయంలో నీటిలో ఏవైనా రసాయనాలు లేదా కెమికల్స్ కలుపుతున్నారా?

పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి.

నీటి, చేపల నమూనాలను పరీక్షించాలని స్థానికుల డిమాండ్

బోగోలు, బిట్రగుంట : బోగోలు మండల పరిధిలో చేపల వేట, చేపల విక్రయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపలు పట్టే సమయంలో నీటిలో ఏవైనా రసాయనాలు లేదా కెమికల్స్ కలుపుతున్నారా? అనే అనుమానాలు స్థానికుల్లో నెలకొన్నాయి. అదే విధంగా చేపల మార్కెట్‌లో చేపలను తాజాగా కనిపించేలా చేసేందుకు హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

చేపల వేట సమయంలో రసాయనాలు ఉపయోగిస్తే నీటి నాణ్యతతో పాటు జలచరాలపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో విక్రయించే చేపల నాణ్యతపై కూడా వినియోగదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తనిఖీలు నిర్వహించాలని డిమాండ్

ఈ నేపథ్యంలో మత్స్యశాఖ, సంబంధిత అధికారులు చేపలు పట్టే ప్రాంతాలను పరిశీలించి, అవసరమైతే నీటి నమూనాలు, చేపల నమూనాలను సేకరించి గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే చేపల మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విక్రయిస్తున్న చేపల నాణ్యతను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పరీక్షల్లో నిబంధనలకు విరుద్ధంగా రసాయనాల వినియోగం ఉన్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చేపల వేట నుంచి మార్కెట్‌లో విక్రయం వరకు నాణ్యత, భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *