Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల అందజేత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల అందజేత

వార్త ముఖ్యాంశాలు

  • మానవత్వానికి మరో నిదర్శనం..
  • సేవా స్ఫూర్తిని చాటుకున్న దాత , గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భైంసా గణేష్ నగర్ విద్యాయూత్ వారు ప్రతిరోజూ నిరుపేద కుటుంబాలను గుర్తించి నిత్యావసర సరుకులను అందిస్తూ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయం.
  • ఈ సేవా కార్యక్రమాన్ని గమనించిన మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన కందనూరి వెంకటేష్ గౌడ్ గారు (వ్యాపారవేత్త) స్వయంగా ముందుకు వచ్చి, “ఒక నిరుపేద కుటుంబానికి నా వంతుగా నిత్యావసర సరుకులు అందిస్తాను” అంటూ ఫోన్ ద్వారా తన సేవాభావాన్ని చాటుకున్నారు.

మానవత్వానికి మరో నిదర్శనం.. సేవా స్ఫూర్తిని చాటుకున్న దాత , గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భైంసా గణేష్ నగర్ విద్యాయూత్ వారు ప్రతిరోజూ నిరుపేద కుటుంబాలను గుర్తించి నిత్యావసర సరుకులను అందిస్తూ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయం. ఈ సేవా కార్యక్రమాన్ని గమనించిన మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన కందనూరి వెంకటేష్ గౌడ్ గారు (వ్యాపారవేత్త) స్వయంగా ముందుకు వచ్చి, “ఒక నిరుపేద కుటుంబానికి నా వంతుగా నిత్యావసర సరుకులు అందిస్తాను” అంటూ ఫోన్ ద్వారా తన సేవాభావాన్ని చాటుకున్నారు. వారి మనసులోని మానవత్వానికి ప్రతిరూపంగా, విద్యాయూత్ వారి చేతుల మీదుగా ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయించారు.సేవ చేయడానికి పెద్ద అవకాశం అవసరం లేదు… మంచి మనసుంటే చాలు.తనకు సాధ్యమైనంతలో ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వారి దాతృత్వం, సేవా స్ఫూర్తి అభినందనీయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *