Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

బచ్చోడు 33/11 KV విద్యుత్ ఉప కేంద్రంలో అధికారుల తీరుపై విమర్శలు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బచ్చోడు 33/11 KV విద్యుత్ ఉప కేంద్రంలో అధికారుల తీరుపై విమర్శలు..

వార్త ముఖ్యాంశాలు

  • ఏఈ గారు ఏరీ..?
  • కార్యాలయానికి చేరారా..?
  • అడిగితే తెలియదనే సమాధానం..!

ఏఈ గారు ఏరీ..? కార్యాలయానికి చేరారా..?
అడిగితే తెలియదనే సమాధానం..!

బచ్చోడు గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రంలోని విద్యుత్ విద్యుత్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 11:35 గంటలైనా ఏఈ, సబ్ ఇంజనీర్ కార్యాలయాలకు తాళాలు వేసి ఉన్నాయి. కార్యాలయంలో ఉన్న ఆపరేటర్ సిబ్బందిని ఏఈ ఎక్కడ.. కార్యాలయానికి వచ్చారా అని ప్రశ్నించగా.. “తెలియదు” అని సమాధానం ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఏఈ స్థాయి అధికారే విధులకు గైర్హాజరు కావడం, సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం పట్ల స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు కార్యాలయానికి తాళం వేసి తిరిగే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *