తిరుమలాయపాలెం సెప్టెంబర్ 21:
పేదరికం, చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన పరిస్థితులు ఆ విద్యార్థి లక్ష్యానికి అడ్డుకాలేదు. పట్టుదలతో చదువుతూ కష్టాలను అధిగమించి ఎంబీబీఎస్ సీటు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. బుడిగెం సాయి వరుణ్.బుడిగెం సుమలత, వెంకటేశ్వర్లుల కుమారుడైన సాయి వరుణ్ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. అనంతరం తన అమ్మమ్మ అల్లి యశోద వద్ద ఉంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. రఘునాథపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన సాయి వరుణ్.. అనంతరం ఏన్కూర్ గురుకులంలో సెకండరీ విద్యను, ఇంటర్మీడియట్ ఖమ్మం ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశాడు.
చదువులో ప్రతిభ కనబరుస్తూ లక్ష్యసాధన దిశగా ముందుకు సాగిన సాయి వరుణ్.. 2025–26 ఎంసెట్‌లో 2088 ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్‌తో వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందాడు.
సాయి వరుణ్ విజయవార్త తెలుసుకున్న జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పేదరికాన్ని అధిగమించి కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. సాయి వరుణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.గ్రామ పెద్దలు గౌని మల్లయ్య,తక్కెళ్ళపల్లి నరేందర్ రావు, య ర్రబోయిన వెంకటేశ్వర్లు, కోండ్రు మహేష్ సాయి వరుణ్ ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

పేదరికాన్ని జయించి.. ఎంబీబీఎస్ సీటు సాధించిన పేదింటి బిడ్డ
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 21: పేదరికం, చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన పరిస్థితులు ఆ విద్యార్థి లక్ష్యానికి అడ్డుకాలేదు. పట్టుదలతో చదువుతూ కష్టాలను అధిగమించి ఎంబీబీఎస్ సీటు సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. బుడిగెం సాయి వరుణ్.బుడిగెం సుమలత, వెంకటేశ్వర్లుల కుమారుడైన సాయి వరుణ్ చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. అనంతరం తన అమ్మమ్మ అల్లి యశోద వద్ద ఉంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. రఘునాథపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన సాయి వరుణ్.. అనంతరం ఏన్కూర్ గురుకులంలో సెకండరీ విద్యను, ఇంటర్మీడియట్ ఖమ్మం ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేశాడు. చదువులో ప్రతిభ కనబరుస్తూ లక్ష్యసాధన దిశగా ముందుకు సాగిన సాయి వరుణ్.. 2025–26 ఎంసెట్‌లో 2088 ర్యాంక్ సాధించాడు. ఈ ర్యాంక్‌తో వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. సాయి వరుణ్ విజయవార్త తెలుసుకున్న జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పేదరికాన్ని అధిగమించి కష్టపడి చదివి వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. సాయి వరుణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.గ్రామ పెద్దలు గౌని మల్లయ్య,తక్కెళ్ళపల్లి నరేందర్ రావు, య ర్రబోయిన వెంకటేశ్వర్లు, కోండ్రు మహేష్ సాయి వరుణ్ ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

