బోనకల్ / ఖమ్మం
బోనకల్లో బీఆర్ఎస్ నూతన మండల పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. రావినూతల నుంచి బోనకల్ వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో పట్టణం గులాబీమయమైంది. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ, బీఆర్ఎస్ కార్యాలయం ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాట కేంద్రంగా, జనతా గ్యారేజ్గా పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ, బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.



