నందలూరు మండలం బ్రాహ్మణ వీధిలోని వినాయక మండపం వద్ద డీజీ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో 21 కేజీల మహా లడ్డూ రూ.1,30,000లకు అమ్ముడైంది. రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి మాతృమూర్తి కొట్టే మణెమ్మ అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్నారు.లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలం అనంతరం కొట్టే మణెమ్మ, ఆమె కుమారుడు కొట్టే శ్రీహరిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. మేళతాళాలు, బాణసంచా మధ్య ఊరేగింపుగా వారి ఇంటికి తీసుకెళ్లి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కొట్టే శ్రీహరి మాట్లాడుతూ, తమ కుటుంబానికి పవిత్రమైన వినాయకుని లడ్డూ దక్కడం ఎంతో సంతోషంగా ఉందని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నందలూరులో రూ.1.30 లక్షలకు వినాయకుని లడ్డూ