Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వ లేకపోతుంది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వ లేకపోతుంది

వార్త ముఖ్యాంశాలు

  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరం, కిర్లంపూడి నియోజకవర్గాల పర్యటనలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
  • కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదు.
  • పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే భద్రతను గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు.వైయస్ జగన్ ప్రజాధరణం చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేక పోతుందని రామకృష్ణ అన్నారు.క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, నాయకులపై తప్పుడు కేసులు పెట్టడానికి, పోలీసులను అడ్డుపెట్టుకుని దిగజారుడు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరం, కిర్లంపూడి నియోజకవర్గాల పర్యటనలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు కూటమి ప్రభుత్వం ఎటువంటి ముందస్తు భద్రతా చర్యలు తీసుకోలేదు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే భద్రతను గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు.వైయస్ జగన్ ప్రజాధరణం చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేక పోతుందని రామకృష్ణ అన్నారు.క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, నాయకులపై తప్పుడు కేసులు పెట్టడానికి, పోలీసులను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయం చేయడానికి మాత్రమే పరిమితమైందన్నారు.జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు, ఆయన మాట వినేందుకు ప్రజలు, అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. ఇటువంటి బహిరంగ సభల్లో కనీస ఏర్పాట్లు చేయకపోవడం వల్ల తొక్కిసలాటలు జరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. కనీసం రోప్ పార్టీలను కూడా సరిగ్గా కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు నిన్నటి పర్యటనలో జరిగిన భద్రతా లోపాలపై తక్షణమే సమీక్ష నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనకు అత్యున్నత స్థాయి ప్రత్యేక రక్షణ కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కూటమి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కాశి రామకృష్ణ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *