Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. 16వ ఏటా భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు.. 3,000 మందికి పైగా భక్తులకు అన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. 16వ ఏటా భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు.. 3,000 మందికి పైగా భక్తులకు అన్నదానం
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 0; shaking: 0.034961; highlight: 1; motionR: 3; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0000,0.0000; brp_del_sen: 0.0000,0.0000; ispap:1; papproctime: 2026:09:17 21:00:46; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2621440;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

ఎల్బీనగర్: ఎన్జీవోస్ కాలనీ, సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత 16 సంవత్సరాలుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 3,000 మందికి పైగా భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా సెప్టెంబర్ 21న లడ్డు వేలం పాట నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డు వేలం పాటను విజయవంతం చేయాలని వారు కోరారు.

రామసేన యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రాజు ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసోసియేషన్ సభ్యులు నరేష్, ఆంజనేయులు, రమేష్, ప్రభాత్, చంటి, తులసి, ఖాజా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

రామసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. 16వ ఏటా భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు.. 3,000 మందికి పైగా భక్తులకు అన్నదానం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *