నోటి ఆరోగ్యం – ముఖ్యమైన జాగ్రత్తలు
1.రోజుకు రెండుసార్లు పళ్లు తోమండి — ఉదయం, రాత్రి పడుకునే ముందు.
2.ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ఉపయోగించి సుమారు 2 నిమిషాలు మెల్లగా బ్రష్ చేయండి.
3.పళ్లను గట్టిగా రుద్దకండి. సున్నితంగా బ్రష్ చేయడం మంచిది.
4.రోజూ పళ్ళనే కాదు నాలుకను కూడా శుభ్రం చేసుకోండి.
5.పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని సూది, పిన్ వంటి పదునైన వస్తువులతో తీయకండి. ఫ్లాస్ లేదా ఇంటర్డెంటల్ బ్రష్ ఉపయోగించండి.
6.మిఠాయిలు, చాక్లెట్లు, కేకులు, బిస్కెట్లు, చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకోకండి.
ఇవి తిన్న తర్వాత నీటితో నోరు పుక్కిలించుకోండి.
7.నోరు ఎండిపోకుండా తగినంత నీరు తాగండి.
8.సిగరెట్, బీడీ, గుట్కా, ఖైనీ, జర్దా, పాన్ వంటి పొగాకు పదార్థాలకు దూరంగా ఉండండి.
9.చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారినా, వాపు లేదా నొప్పి ఉన్నా నిర్లక్ష్యం చేయకండి.
10.పళ్లు వదులుగా మారితే దంత వైద్యుడిని సంప్రదించండి.
11.నోటిలో రెండు వారాలకు మించి తగ్గని పుండు, తెల్లటి లేదా ఎర్రటి మచ్చ ఉంటే వెంటనే వైద్యుడిని చూపించండి.
12.నోరు తెరవడం, నమలడం లేదా మింగడంలో ఇబ్బంది ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి.
13.సమస్యలు వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా, అవసరాన్ని బట్టి దంత వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించండి.
14.పిల్లలకు చిన్నప్పటి నుంచే పళ్లు శుభ్రం చేసుకోవడం, తీపి పదార్థాలను పరిమితం చేయడం వంటి మంచి అలవాట్లు నేర్పండి.
“రోజూ కొద్దిసేపు నోటి సంరక్షణకు కేటాయిస్తే…
ఆరోగ్యకరమైన చిరునవ్వు జీవితాంతం మనతో ఉంటుంది.
డాక్టర్ ఎంవి రమణయ్య.సీనియర్ డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల. నెల్లూరు..
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు.

