Tuesday, 15 September 2026
  • Home  
  • వంగల్లు అరుంధతివాడలో గణనాథుడిని దర్శించుకున్న టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ చంద్ర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వంగల్లు అరుంధతివాడలో గణనాథుడిని దర్శించుకున్న టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ చంద్ర

సంగం మండలం వంగల్లు గ్రామంలోని అరుంధతివాడ దేవాలయం సెంటర్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడిని నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ చంద్ర దర్శించుకున్నారు.గ్రామ యువత కోరిక మేరకు వినాయక విగ్రహం ఏర్పాటుకు, అలాగే గతంలో క్రికెట్ కిట్ కోసం విజయ్ చంద్ర సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తించిన గ్రామ యువత, పెద్దలు విజయ్ చంద్రను ఘనంగా సత్కరించారు.అనంతరం వంగల్లు అరుంధతివాడ గ్రామ పెద్దల సమక్షంలో గణనాథుడికి ప్రసాదంగాలడ్డూనుసమర్పించారు.అరుంధతివాడ గ్రామ పెద్దలు, యువత కోరిక మేరకు డప్పు కళాకారులకు, అరుంధతివాడ యువతకు అవసరమైన డప్పులను ఏర్పాటు చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించి కృషి చేస్తానని విజయ్ చంద్ర హామీ ఇచ్చారు.అలాగే రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో అరుంధతివాడ దేవాలయం చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా విజయ్ చంద్ర మాట్లాడుతూ.. వంగల్లు అరుంధతివాడ గ్రామంలోని పిల్లలు, పెద్దలు, మహిళలందరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.అదేవిధంగా జంగాలకండ్రిగ, మర్రిపాడు గ్రామాల్లోని పలు కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద అన్నదాన కార్యక్రమాలకు కూడా విజయ్ చంద్ర సహాయ సహకారాలు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.