Thursday, 3 September 2026
  • Home  
  • ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్సీ సన్మానం వర్ల రామయ్య వసంత కృష్ణ ప్రసాద్ ఘన సన్మానం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్సీ సన్మానం వర్ల రామయ్య వసంత కృష్ణ ప్రసాద్ ఘన సన్మానం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా

ఇబ్రహీంపట్నంలో ఘనంగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారికి సత్కారం. పార్టీ కోసం రెండున్నర దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకులు రామయ్య గారు. –మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3, 2026: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నూతనంగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన వర్ల రామయ్య గారికి ఇబ్రహీంపట్నంలో ఘన సత్కారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్. కళ్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వర్ల రామయ్య గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తొలుత అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ.. నిబద్ధతతో కూడిన జీవనశైలి వర్ల రామయ్య గారిదని, తెలుగుదేశం పార్టీ కోసం ఆయన గత రెండున్నర దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ వెన్నుదన్నుగా నిలిచి, పార్టీ సిద్ధాంతాల కోసం నిరంతరం పనిచేసిన సీనియర్ నాయకుడిగా వర్ల రామయ్య గారికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల విధేయతతో ఉంటూ, పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వర్ల రామయ్య గారు చేసిన సేవలు చిరస్మరణీయమని వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీకి బలమైన స్వరంగా నిలిచిన వర్ల రామయ్య గారికి శాసనమండలి సభ్యునిగా అవకాశం లభించడం సంతోషకరమన్నారు. ఈ పదవిలో ప్రజల గొంతుకగా మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. వర్ల రామయ్య గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు వర్ల రామయ్య గారి నిబద్ధత, అంకితభావాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మైలవరంలో కూటమికే సంపూర్ణ విజయం: వర్ల రామయ్య గారు. సత్కారానికి స్పందించిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారు మైలవరం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే సంపూర్ణ విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి ఎదురులేదని, ఆయనకు సరైన రాజకీయ ప్రత్యర్థి లేరని వర్ల రామయ్య గారు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేసి చెబుతున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రజలు మరోసారి ఘన విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య గారిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) గారు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నంలో ఘనంగా ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారికి సత్కారం.

పార్టీ కోసం రెండున్నర దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేసిన సీనియర్ నాయకులు రామయ్య గారు.

–మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3, 2026:

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నూతనంగా శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన వర్ల రామయ్య గారికి ఇబ్రహీంపట్నంలో ఘన సత్కారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఎం.వి.ఆర్. కళ్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వర్ల రామయ్య గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

తొలుత అన్న ఎన్టీఆర్ గారి ప్రతిమకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ.. నిబద్ధతతో కూడిన జీవనశైలి వర్ల రామయ్య గారిదని, తెలుగుదేశం పార్టీ కోసం ఆయన గత రెండున్నర దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ వెన్నుదన్నుగా నిలిచి, పార్టీ సిద్ధాంతాల కోసం నిరంతరం పనిచేసిన సీనియర్ నాయకుడిగా వర్ల రామయ్య గారికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల విధేయతతో ఉంటూ, పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వర్ల రామయ్య గారు చేసిన సేవలు చిరస్మరణీయమని వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అభినందనీయమన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీకి బలమైన స్వరంగా నిలిచిన వర్ల రామయ్య గారికి శాసనమండలి సభ్యునిగా అవకాశం లభించడం సంతోషకరమన్నారు. ఈ పదవిలో ప్రజల గొంతుకగా మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

వర్ల రామయ్య గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు వర్ల రామయ్య గారి నిబద్ధత, అంకితభావాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

మైలవరంలో కూటమికే సంపూర్ణ విజయం: వర్ల రామయ్య గారు.

సత్కారానికి స్పందించిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య గారు మైలవరం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ లేదని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకే సంపూర్ణ విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి ఎదురులేదని, ఆయనకు సరైన రాజకీయ ప్రత్యర్థి లేరని వర్ల రామయ్య గారు పేర్కొన్నారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేసి చెబుతున్నానని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రజలు మరోసారి ఘన విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వర్ల రామయ్య గారిని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి శ్రీ అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ) గారు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.