Wednesday, 2 September 2026
  • Home  
  • వైసీపీపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. సజ్జలపై తీవ్ర ఆరోపణలు వెల్లువ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైసీపీపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. సజ్జలపై తీవ్ర ఆరోపణలు వెల్లువ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందని, కూటమి విజయం–జగన్ ఓటమి చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం, పెట్టుబడిదారులను బెదిరించడం, కులాలు–మతాల మధ్య విభేదాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందూ ధర్మంపై వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల క్రెడిట్ విషయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మధ్య గతంలో విభేదాలు చోటుచేసుకున్నాయని, 2022 ప్లీనరీ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని కోటంరెడ్డి ఆరోపించారు. అమరావతి రైతులతో తాను మాట్లాడిన సందర్భంలోనూ సజ్జల తనను ప్రశ్నించారని తెలిపారు. రాజకీయ డ్రామాలు పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని వైసీపీ నేతలకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.