Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఘనంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిశేఖర్ రెడ్డి సన్మానం పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు: నూకతోటి రాజేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఘనంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిశేఖర్ రెడ్డి సన్మానం పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు: నూకతోటి రాజేష్

వార్త ముఖ్యాంశాలు

  • 👉 సత్యవేడు : వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఏ.వి.ఎం.
  • మునిశేఖర్ రెడ్డికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
  • కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

👉 సత్యవేడు : వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఏ.వి.ఎం. మునిశేఖర్ రెడ్డికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

👉 ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మునిశేఖర్ రెడ్డిని అభినందించారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

👉 ఎన్నికల్లో శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు తప్పకుండా ఇస్తామని రాజేష్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఈవీఎంల సమస్యలు కూడా ఒక కారణమని పేర్కొన్నారు.

👉 ఇటీవల జరిగిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లోనూ అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని నూకతోటి రాజేష్ తెలిపారు.

👉 సన్మాన గ్రహీత మునిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,మిథున్ రెడ్డి,ఎం పి గురుమూర్తి ,సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ , కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానన్నారు.

👉 రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరితో కలిసి కృషి చేస్తానని, తనకు అప్పగించిన బాధ్యతలకు గెలుపుతోనే కృతజ్ఞతలు తెలియజేస్తానని మునిశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

👉 ఈ కార్యక్రమంలో టీయూసీ రాష్ట్ర సెక్రటరీ జె.బి. మునిరత్నం, జిల్లా సెక్రెటరీ జగదీష్ రెడ్డి, రాకేష్ కిరణ్,హరి,శ్యామ్, వివిధ మండలాల వైఎస్సార్సీపీ నాయకులు స్వరాజ్ ఆనంద్, అన్నా దొరై, డేవిడ్, ఆరే. ధనుంజయ రెడ్డి, మహేష్ రెడ్డి, ప్రసాద్, తిలక్ బాబు, సురేష్, దశరధ రెడ్డి, దయాకర్ రెడ్డి, రవి రెడ్డి (బి.ఎన్. కండ్రిగ), మల్లికార్జున్ రెడ్డి, శివ, దేశపన్, మహిళా నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

👉 నాయకులు, కార్యకర్తలు, జగన్‌మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మునిశేఖర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *