వార్త ముఖ్యాంశాలు
- లక్ష్మణ్చందా: నిర్మల్ జిల్లా లక్ష్మణ్చందా మండలం వడ్యాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
- లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమై, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నాయకులు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, లక్ష్మణ్చందా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే.
లక్ష్మణ్చందా: నిర్మల్ జిల్లా లక్ష్మణ్చందా మండలం వడ్యాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమై, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, లక్ష్మణ్చందా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. నరేష్ రెడ్డి, మోహన్, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.