వార్త ముఖ్యాంశాలు
- నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి సేవలకు ప్రశంసలు ఆత్మకూరు, ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మండలం వెన్నవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో శ్రీ సరస్వతి దేవి మండప నిర్మాణానికి శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి శుక్రవారం భూమి…
- పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల విన్నపం మేరకు ఆయన స్వయంగా పాఠశాలకు విచ్చేసి మండప నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు కంచి పరమేశ్వర రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు.
- అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సరస్వతి దేవి మండప నిర్మాణ పనులను ప్రారంభించారు.
నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి సేవలకు ప్రశంసలు
ఆత్మకూరు, ఆగస్టు 28 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మండలం వెన్నవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో శ్రీ సరస్వతి దేవి మండప నిర్మాణానికి శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల విన్నపం మేరకు ఆయన స్వయంగా పాఠశాలకు విచ్చేసి మండప నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు కంచి పరమేశ్వర రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సరస్వతి దేవి మండప నిర్మాణ పనులను ప్రారంభించారు. విద్యార్థుల్లో విద్యతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు ఈ మండపం ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్న నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డికి పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సరస్వతి దేవి మండప నిర్మాణం పూర్తయితే పాఠశాల ప్రాంగణానికి మరింత శోభ చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.