భద్రాద్రి కొత్తగూడెం:-పున్నమి వార్తలు చుంచుపల్లి మండలం 26/08/2026
కొత్తగూడెం :శేషగిరి భవన్ లో ఎఐవైయఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,అనంతరం జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ అఖిల భారత యూవజన సమాఖ్య దేశవ్యాప్తంగా దేశ సమగ్ర సమైక్యతను పరిరక్షించడానికి సమరశిల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐవైఎఫ్. భరతదేశ భవిష్యత్తు అభివృద్ధిలో ఎఐవైఎఫ్ పాత్ర చాలా ముఖ్యమైనదాని, అఖిల భారత యూవజన సమాఖ్య 1959 మే 3వ తేదీన ఆవిర్బవించింది దేశం కోసం ప్రాణర్పణ చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, చంద్రశేఖర్ అజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి అమరవీరుల వరసత్వాన్ని పనికిపుచ్చుకొని యూవజన హక్కుల సాధనకై, సామజిక అభివృద్ధికై పాటుపడుతూ యూవజన ఉద్యమాలను ముందుకు కొనసాగిస్తుందని, యువతరంలో ప్రగతిశీల అభ్యుదయ దేశ భక్తి, లౌకిక ప్రజాస్వామిక, నైతిక విలువలను మానవత్వాన్ని నింపడానికి నిరంతరం ఎఐవైఎఫ్ పాటుపడుతుందని, పనిహక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యూవజన విధానం కోసం,విద్య కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని ఎఐవైఎఫ్ సమారశాంఖంపూరించడానికి
ఈనెల 27న శేషగిరి భవన్ కొత్తగూడెం లో నిర్మాణ మహాసభలు జరుపుకున్నామని యూవకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాలనీ ఫహీమ్ దాదా కోరారు ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి sk,ఖయ్యుమ్,నాయకులు జావీద్,కొయ్యడ రవి,రామకృష్ణ,బన్ను,శివ,చిన్ను,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు


