Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందస్తు అనుమతి తప్పనిసరి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందస్తు అనుమతి తప్పనిసరి.

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి.
  • గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనంపై నిర్వాహకులకు పోలీసుల అవగాహన.
  • - ప్రజా రహదారులు, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా మండపాల ఏర్పాటు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి.

గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనంపై నిర్వాహకులకు పోలీసుల అవగాహన.
– ప్రజా రహదారులు, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా మండపాల ఏర్పాటు.

– రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దం, సాంస్కృతిక కార్యక్రమాలకు నిషేధం.

– DJలు, హైపవర్ మ్యూజిక్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు.

– నిమజ్జన ఊరేగింపులో పోలీసుల సూచించిన మార్గం, తేదీ, సమయాన్ని తప్పనిసరిగా పాటించాలి.

– మద్యం, మత్తు పదార్థాల వినియోగం, బాణాసంచా, రెచ్చగొట్టే సోషల్ మీడియా ప్రచారాలకు దూరంగా ఉండాలి

తిరుపతి ఆగష్టు 23: రాబోయే వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారి ఆదేశాలు, రేణిగుంట సబ్-డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ వై. శ్రీనివాసరావు, డీస్పీ గారి సూచనల మేరకు, కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించే ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి. చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందు పోలీస్ శాఖతో పాటు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు లిఖితపూర్వక అనుమతి పొందాలని, అనుమతి ప్రతిని గణేష్ మండపం వద్ద ప్రదర్శించాలని నిర్వాహకులకు సూచించారు. మండపాలను ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ మరియు అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 06.00 గంటల వరకు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేదా అధిక శబ్దంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించరాదని, DJలు, హైపవర్ మ్యూజిక్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా శబ్ద కాలుష్యానికి పాల్పడరాదని, మండపాల వద్ద తగిన విద్యుత్, అగ్నిమాపక, లైటింగ్, జనసమూహ నియంత్రణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మండపాల వద్ద కనీసం ముగ్గురు బాధ్యతగల వాలంటీర్లను అందుబాటులో ఉంచి, వారి వివరాలను పోలీసులకు అందజేయాలని తెలిపారు. బాల కార్మికులను వినియోగించరాదని, రహదారులపై ప్రజలు, దుకాణదారుల నుంచి బలవంతంగా విరాళాలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు.

నిమజ్జన ఊరేగింపులకు ముందుగానే తగిన వాహనాలను ఏర్పాటు చేసుకొని, పోలీసులు ఆమోదించిన మార్గం, తేదీ, సమయాన్ని కచ్చితంగా పాటించాలని సూచించారు. నిమజ్జన వాహనాలపై DJలు, మ్యూజిక్ సిస్టమ్స్, బాణాసంచా మరియు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతి లేదని తెలిపారు.

పాదచారులు, వాహనదారులపై గులాల్, కుంకుమ, రంగులు లేదా ఇతర పదార్థాలను విసరడం నిషేధమని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్న వ్యక్తులను ఊరేగింపులో పాల్గొనకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.

నిమజ్జన ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ప్రార్థనా స్థలాలు మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల వద్ద అనవసరంగా ఊరేగింపును నిలిపివేయరాదని తెలిపారు. పోలీసులు నిర్దేశించిన నిమజ్జన ప్రదేశాల్లో మాత్రమే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని స్పష్టం చేశారు.

వినాయక చవితి వేడుకల సందర్భంగా ఎటువంటి రెచ్చగొట్టే, వివాదాస్పద లేదా అనధికారిక సమాచారాన్ని WhatsApp, సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదని నిర్వాహకులకు సూచించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

– తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ముందస్తు అవగాహన కల్పిస్తూ ఈ సమావేశం నిర్వహించారు. పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సి. చంద్రశేఖర్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *