పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈరోజు జరుగుతున్న ఈ జనరల్ బాడీ సమావేశం ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులకు చివరి సమావేశం కానుందని ఎమ్మెల్యే తెలిపారు. తమ పదవీకాలంలో ప్రజలకు సేవలందించిన ఎంపీటీసీ సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ తరఫున ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ని ఘనంగా సత్కరించారు. అదే విధంగా ఎమ్మెల్యే కూడా ఎంపీటీసీ సభ్యులను సత్కరించి, వారి సేవలను అభినందించారు.
ఈ సమావేశం లో
గిడ్డి ఆనంద్,మరియు ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వఅధికారులు,ఎంపీపీ , ఎంపీటీసీ సభ్యులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
