వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా నందలూరు మండలం పాటూరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం..
- కడప జిల్లా నందలూరు మండలం పాటూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
- రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కడప జిల్లా నందలూరు మండలం పాటూరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం..
కడప జిల్లా నందలూరు మండలం పాటూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త ఎల్లమరాజు శ్రీనివాసరాజు ఆయనను శాలువాతో సత్కరించి శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేశారు. అమ్మవారి కృపతో నందలూరు మండల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని సాయి లోకేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.