Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

యనమల భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పగడాల శివకుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యనమల భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పగడాల శివకుమార్

వార్త ముఖ్యాంశాలు

  • జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల రాష్ట్ర కమిటీలో యనమల భాస్కర్‌కు స్థానం కల్పించడంపై చిట్వేలి మండలం టౌన్ చిరంజీవి యువత అధ్యక్షుడు పగడాల శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు.
  • ఈ సందర్భంగా భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
  • పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలు నచ్చి ఉన్నత చదువులు పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో భాస్కర్ రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు.

జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల విధివిధానాల రాష్ట్ర కమిటీలో యనమల భాస్కర్‌కు స్థానం కల్పించడంపై చిట్వేలి మండలం టౌన్ చిరంజీవి యువత అధ్యక్షుడు పగడాల శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆలోచనలు నచ్చి ఉన్నత చదువులు పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో భాస్కర్ రాజకీయాల్లోకి రావడం అభినందనీయమన్నారు. నిజాయితీ, నిబద్ధత, నమ్మకంతో పనిచేస్తున్న భాస్కర్‌కు కీలక బాధ్యత అప్పగించడం సముచిత నిర్ణయమన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శివకుమార్ తెలిపారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగుతామన్నారు. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి తనను ఆకట్టుకుందని, ఆయన స్థాపించిన జనసేనలో కొనసాగడం గర్వంగా ఉందని శివకుమార్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *