Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*పిల్లలు పోటెత్తారు… సార్లు ఎక్కడ?*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*పిల్లలు పోటెత్తారు… సార్లు ఎక్కడ?*

బడిబాటతో ప్రభుత్వ బడులకు జనం… కానీ ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం*…
వరదయ్యపాలెం మండల కేంద్రంలోని గోవర్ధనపురం ప్రాథమిక పాఠశాలలో 165 మంది విద్యార్థులతో రికార్డు స్థాయిలో కళకళలాడుతున్న ప్రాథమిక పాఠశాల — వెంటనే అదనపు ఉపాధ్యాయులను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.,
ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ స్థాయిలో 165 మంది చదువుతుండడం జిల్లాలో నే ఇది ఒకే ఒక పాఠశాల కావడం విశేషం ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు మాత్రమే చదువుతుండడం గమనార్హం
~~~~~~~~~~~~~~~~
*సారు… మా పాఠశాలకు ఇంకో సార్లను నియమించరాదే*..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే పేదింటి పిల్లల ఆకాంక్ష పెరుగుతోంది… తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం తిరిగి వస్తోంది… కానీ అదే సమయంలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం కొత్త సమస్యగా మారుతోంది.
ఒక ప్రాథమిక పాఠశాలలో ఏకంగా 165 మంది విద్యార్థులు చేరడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై బోధనా భారం పెరుగుతోందని, దీని ప్రభావం విద్యార్థుల చదువుపై పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…

*బడిబాటకు మంచి స్పందన… ప్రభుత్వ బడుల వైపు పేదింటి పిల్లలు*

*బడి పిలుస్తోంది–బడిబాట* కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు గడపగడపకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్య, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను సైతం ప్రభుత్వ బడుల వైపు తీసుకొస్తున్నారు.
ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు ప్రైవేట్ పాఠశాలల ఫీజులు చెల్లించలేక పిల్లలను ఇంటివద్దే ఉంచుకోవాల్సిన పరిస్థితులు కూడా గతంలో కనిపించేవి. అయితే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో ఇప్పుడు ఆ పిల్లలు సైతం బడి బాట పడుతున్నారు.
పిల్లలు రావడం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు విజయమే… కానీ వచ్చిన పిల్లలకు సరిపడా ఉపాధ్యాయులను అందించడం కూడా అంతే కీలకం…
~~~~~~~~~~~~~~~~
*165 మంది పిల్లలు… మరి ఉపాధ్యాయులు ఎంతమంది*?
ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరిన విషయం విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందా?
వెళ్లి ఉంటే… అదనపు ఉపాధ్యాయుల నియామకంపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు?
అసలు పాఠశాలలో ప్రస్తుతం ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు?
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంకా ఎంతమంది అవసరం?
ఉపాధ్యాయుల కొరత కారణంగా తరగతుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి?
ఈ ప్రశ్నలకు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు….
~~~~~~~~~~~~~~~~
*ఏది ఏమైనా*
మంత్రి నారా లోకేష్ లక్ష్యానికి కిందిస్థాయిలోనే బలం కావాలి!
పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యారంగంలో పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను సానుకూల పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది.
అయితే విద్యార్థులు పెరుగుతున్న చోట ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగాలి. లేకపోతే ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న తల్లిదండ్రుల నమ్మకానికి విఘాతం కలిగే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య పెరిగిందంటే అది సమస్య కాదు… అది ప్రభుత్వ విద్యపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖదే!
ఇకనైనా అధికారులు మేల్కొనాలి!
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, అవసరమైన అదనపు సిబ్బంది, తరగతుల నిర్వహణ పరిస్థితులపై వెంటనే సమగ్రంగా పరిశీలన చేయాలని స్థానికులు కోరుతున్నారు…

“పిల్లలను బడికి తీసుకురావడమే కాదు… బడికి వచ్చిన ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందేలా చూడాలి” అని వారు అంటున్నారు.
పిల్లలు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు… తల్లిదండ్రులు పంపడానికి సిద్ధంగా ఉన్నారు… ఉపాధ్యాయులు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు… ఇక విద్యాశాఖ చేయాల్సింది ఒక్కటే — అవసరమైన చోట అవసరమైనంత మంది ఉపాధ్యాయులను వెంటనే నియమించడం!
165 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకముందే అధికారులు స్పందించాలి… “సారు జర… మా బడికి సార్లను పంపించరాదే!” అన్న విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తికి వెంటనే పరిష్కారం చూపాలి.

*పిల్లలు పోటెత్తారు… సార్లు ఎక్కడ?*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *