వార్త ముఖ్యాంశాలు
- విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
- మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు గంజాయి చాక్లెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
- ఈ ఘటనలో సుమారు 23 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముఠాను కుత్బుల్లాపూర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు గంజాయి చాక్లెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో సుమారు 23 కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజులరామారం, మహదేవపురం ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులతో పాటు ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. నిందితులను జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు సమాచారం. గంజాయి చాక్లెట్ల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, వీటి విక్రయానికి సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.