వార్త ముఖ్యాంశాలు
- డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సెంట్రల్ డెల్టాలో కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలం పరిధిలో ఉన్న మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పునర్ నిర్మించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.
- ఈ సందర్భంగా అసెంబ్లీలో సత్యానందరావు మాట్లాడుతూ లొల్ల లాకులపైన కొంచెం మెట్ట ప్రాంతంగా ఉంటుందని దానికి గ్రావిటీ మీద నీరు వెళ్ళే పరిస్థితి లేదని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయని ఉచ్చిలి, వసంతావాడ అనే రెండు లిఫ్ట్ ఇరిగేషన్ లు ఏపీఐడిసి కింద నీరు అందిస్తున్నట్టు తెలిపారు.
- ఉచ్చిల స్కీమ్ వచ్చి 1176 ఎకరాలు, వసంతవాడ స్కీమ్ వచ్చి 2010 ఎకరాలు ఏపీఐడిసి కింద ఉన్నాయని, అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కింద పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3000 ఎకరాలు, మూడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పని చేస్తేనే ఆ ప్రాంత రైతులకి సాగునీరు అందించే…
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సెంట్రల్ డెల్టాలో కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలం పరిధిలో ఉన్న మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పునర్ నిర్మించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సత్యానందరావు మాట్లాడుతూ లొల్ల లాకులపైన కొంచెం మెట్ట ప్రాంతంగా ఉంటుందని దానికి గ్రావిటీ మీద నీరు వెళ్ళే పరిస్థితి లేదని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయని ఉచ్చిలి, వసంతావాడ అనే రెండు లిఫ్ట్ ఇరిగేషన్ లు ఏపీఐడిసి కింద నీరు అందిస్తున్నట్టు తెలిపారు. ఉచ్చిల స్కీమ్ వచ్చి 1176 ఎకరాలు, వసంతవాడ స్కీమ్ వచ్చి 2010 ఎకరాలు ఏపీఐడిసి కింద ఉన్నాయని, అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కింద పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3000 ఎకరాలు, మూడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పని చేస్తేనే ఆ ప్రాంత రైతులకి సాగునీరు అందించే పరిస్థితి ఉందన్నారు. మూడు కూడా శిథిలావస్థలో ఉన్నాయన్నారు. అందులో ఉచ్చిల స్కీమ్ అయితే మొత్తం శిథిలమైందన్నారు. దాన్ని నిర్మాణానికి అంచనాలు వేయించం జరిగిందని 9 కోట్ల రూపాయలని, అదేవిధంగా వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందని, దానికి 3 కోట్ల 60 లక్షల రూపాయలు అంచనా వేయడం జరిగిందని వివరించారు. పేరవరం స్కీమ్ 5 వేల ఎకరాలు మేజర్ ఇరిగేషన్ కింద దాన్ని పూర్తిగా రెన్యూవేషన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ మూడు స్కీముల విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితులకు కారణం గత ప్రభుత్వం నిర్వాకం వలన చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. లక్షలాది ఎకరాలు ఆయకట్టు రైతులకు మేలు చేకూరుతుందని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు అన్నీ కూడా పునరుద్దరణ చేసే ఈ ప్రతిపాదల ప్రభుత్వం దగ్గర పరిశీలనలో ఉన్నాయన్నారు. ఆత్రేయపురం మండలంలోని మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నిర్ణయం తీసుకొని పరిపాలన అనుమతులు మంజూరు చేసి లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు.