Sunday, 16 August 2026
  • Home  
  • *వెన్నెల గద్దర్‌ను సత్కరించిన కోరుకొండ జాన్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

*వెన్నెల గద్దర్‌ను సత్కరించిన కోరుకొండ జాన్

పున్నమి దినపత్రిక పి. గన్నవరం, ఆగస్టు 15: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం ప్రాంతానికి చెందిన మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్, ఆయన కుమారుడు కోరుకొండ నవీన్ కలిసి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ రథసారథి, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్‌ను ఆగస్టు 15వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా డా. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మమత స్వచ్ఛంద సేవా సమితి ద్వారా గద్దర్ పేరుతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చూసి సంతోషం వ్యక్తం చేసి, అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.తన తండ్రి గద్దర్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఒక ప్రణాళికను రూపొందించి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్, డా. వెన్నెల గద్దర్‌కు చేతి గడియారాన్ని బహూకరించి సత్కరించారు. # శివకృష్ణ.పినిపే- పున్నమి దినపత్రిక

పున్నమి దినపత్రిక పి. గన్నవరం, ఆగస్టు 15: డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం ప్రాంతానికి చెందిన మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్, ఆయన కుమారుడు కోరుకొండ నవీన్ కలిసి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ రథసారథి, ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్‌ను ఆగస్టు 15వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా డా. వెన్నెల గద్దర్ మాట్లాడుతూ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మమత స్వచ్ఛంద సేవా సమితి ద్వారా గద్దర్ పేరుతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చూసి సంతోషం వ్యక్తం చేసి, అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.తన తండ్రి గద్దర్ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఒక ప్రణాళికను రూపొందించి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. కోరుకొండ జాన్, డా. వెన్నెల గద్దర్‌కు చేతి గడియారాన్ని బహూకరించి సత్కరించారు.

# శివకృష్ణ.పినిపే- పున్నమి దినపత్రిక

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.