అమలాపురం లైన్స్ క్లబ్ వశిష్ట ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలవిద్యార్థులకు యూనిఫారాలుపంపిణీ
అమలాపురం జూలై 25
లయన్స్ క్లబ్ అమలాపురం వశిష్ట వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.జీ.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముమ్మిడివరం లో 20 మంది కాలేజీ విద్యార్థులకు, క్లబ్ ప్రెసిడెంట్ చిక్కాల అరుణ యూనిఫార్మ్స్ ఉచితముగా ఈ రోజున అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య జీవితాన్ని వెలిగించే దీపమని సంపదలు కరిగిపోతాయని విద్య మాత్రం జీవితాంతం తోడు ఉంటుందని ఆమె అన్నారు. విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో సంకల్పంతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు సమాజసేవ లయన్స్ క్లబ్ వశిష్ట లక్ష్యమని విద్యార్థులకు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె చెప్పారు విద్యార్థులకు విద్యాభ్యాసంలో ప్రోత్సాహం కల్పించాలని లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.క్లబ్ సర్వీస్ చైర్ పర్సన్ లయన్ మాకిరెడ్డి పూర్ణిమ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడడం, వారికి అవసరమైన సహాయం చేయడం మా క్లబ్ ప్రధాన లక్ష్యాలలో ఒకటని, యూనిఫారం అనేది కేవలం దుస్తులు మాత్రమే కాదు, అది ఒక క్రమశిక్షణకు, సమానత్వానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఈ చిన్న సహాయం మీ విద్యా ప్రయాణంలో కొంతైనా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం క్లబ్బు సీనియర్ మార్గదర్శి లయన్ పప్పు కామేశ్వరి దేవి మాట్లాడుతూ, విద్యే మీ జీవితాన్ని మార్చగల గొప్ప ఆస్తి అని, మీరు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని, దేశ భవిష్యత్తుకు బాసటగా నిలవాలని, మీ ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు, కళాశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ పి .ఎల్. ప్రశాంతి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ లయన్ శిష్టా లక్ష్మీదేవి, కోశాధికారి లయన్ డి .పద్మ ప్రసాద్, లయన్ చిక్కాల సతీష్ క్లబ్ సభ్యులు , కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


