Wednesday, 22 July 2026
  • Home  
  • కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కేరమేరి మండలంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేతుల మీదుగా అందజేత
కేరమేరి, జూలై 22: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేరమేరి మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.