Tuesday, 21 July 2026
  • Home  
  • జూలై 24 నుంచి 26 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం
- తిరుపతి

జూలై 24 నుంచి 26 వరకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం

పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 21 మూడురోజుల పాటు శాస్త్రోక్తంగా అభిధేయక అభిషేక మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు. ఈ వార్షిక ఉత్సవంలో స్వామివారి స్వర్ణకవచాలను శాస్త్రోక్తంగా తొలగించి, పవిత్రంగా శుద్ధి చేసి తిరిగి అలంకరిస్తారు. మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు – జూలై 24 – కవచాధివాసం – జూలై 25 – కవచ ప్రతిష్ఠ – జూలై 26 – కవచ సమర్పణ ప్రతిరోజూ ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడతాయి. ఆషాఢ మాసంలో వార్షిక వైభవం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ జ్యేష్ఠాభిషేకం ద్వారా శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని ఆలయ ఆగమ పండితులు పేర్కొంటున్నారు. టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

పున్నమి ప్రతినిధి, తిరుపతి జూలై 21

మూడురోజుల పాటు శాస్త్రోక్తంగా అభిధేయక అభిషేక మహోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు.

ఈ వార్షిక ఉత్సవంలో స్వామివారి స్వర్ణకవచాలను శాస్త్రోక్తంగా తొలగించి, పవిత్రంగా శుద్ధి చేసి తిరిగి అలంకరిస్తారు.

మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు

– జూలై 24 – కవచాధివాసం
– జూలై 25 – కవచ ప్రతిష్ఠ
– జూలై 26 – కవచ సమర్పణ

ప్రతిరోజూ ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడతాయి.
ఆషాఢ మాసంలో వార్షిక వైభవం
ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ జ్యేష్ఠాభిషేకం ద్వారా శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని ఆలయ ఆగమ పండితులు పేర్కొంటున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.